మెగా ఫోన్ పట్టుకోబోతున్న స్టంట్ మాస్టర్ !
Published on Dec 4, 2017 7:50 pm IST

యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్స్‌ త్వరలోనే మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు. దక్షిణాది భాషల సినిమాల్లో పోరాట ఘట్టాల్ని కొత్త పుంతలు తొక్కించిన పీటర్ హెయిన్స్ పరిచయం అక్కర్లేని పేరు. భారీ స్థాయి హంగులున్న చాలా చిత్రాలకి ఆయన ఫైట్స్ కంపోజ్ చేసారు. ఇటీవల జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఈ ఫైట్ మాస్టర్ యాక్షన్‌ కొరియోగ్రఫీలో జాతీయ పురస్కారాన్ని అందుకొన్న మొట్ట మొదటి ఫైట్‌ మాస్టర్‌ గా పీటర్ హెయిన్స్ కు గుర్తింపు లభించింది.

తల్లి కూతుళ్ళ సెంటిమెంట్ తో సినిమా చెయ్యబోతున్న పీటర్ హెయిన్స్ తన సినిమాలో నటించే నటీనటుల, ఇతర వివరాలు త్వరలో తెలియజేయనున్నాడు. ‘అత్తారింటికి దారేది, బాహుబలి, స్పైడర్’ వంటి సూపర్ హిట్ సినిమాలకు పీటర్ మాస్టర్ కంపోస్ చేసిన స్టంట్స్ కు మంచి గుర్తింపు లభించింది.

 
Like us on Facebook