వైరల్ : “ఇండియన్ 2” సెట్స్ నుంచి స్టైలిష్ కమల్.!

Published on Feb 1, 2023 9:00 am IST

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లాస్ట్ చిత్రం “విక్రమ్” సెన్సేషనల్ హిట్ కావడంతో నెక్స్ట్ రాబోయే భారీ చిత్రం “ఇండియన్ 2” పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో జరుగుతూ ఉండగా ప్రస్తుతం అయితే తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. మరి లేటెస్ట్ గా అయితే ఈ సినిమా సెట్స్ నుంచి కమల్ లేటెస్ట్ లుక్ బయటకొచ్చి వైరల్ అవుతున్నాయి.

మరి తన స్పెషల్ ఛాపర్ నుంచి బయట కనిపిస్తున్న కమల్ మంచి స్టైలిష్ అండ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు. దీనితో ఈ ఫోటోలు ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. మరి కమల్ అయితే ఈ సినిమా కోసం స్పెషల్ గా ఈ ఛాపర్ ని కేవలం వచ్చి వెళ్లడం కోసం వినియోగిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ భారీ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :