వైరల్..”బిగ్ బాస్ 5″ కంటెస్టెంట్స్ తో స్టైలిష్ మెగాస్టార్.!

Published on Dec 12, 2021 9:00 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు మళ్ళీ తన కెరీర్ లో పాత రోజుల్లో ఏకకాలంలో నాలుగు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఒక్కో సినిమాకి ఒక్కో వేరియేషన్ లో మెగాస్టార్ కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక ఆసక్తికర ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఏడాది బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 లో ఆడినటువంటి కంటెస్టెంట్స్ యాంకర్ మరియు లోబో తో కలిసి చిరు పిక్ ఒకటి బయటికి వచ్చింది. అయితే ఇది బహుశా దర్శకుడు బాబీ తో సినిమా ఏమో కానీ మెగాస్టార్ మాత్రం సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. దీనితో ఇది చూసి మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :