హీరోగా మారాలని కలలు కంటున్న విలన్ !


తెలుగులో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారు నిర్మించిన ‘అరుంధతి’ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడి పాత్ర పోషించి కెరీర్లోనే గొప్ప బ్రేక్ అందుకున్న నటుడు సోనూ సూద్ ఆ తర్వాత ‘జులాయి, బుజ్జిగాడు’ వంటి సినిమాల్లోనూ అసామాన్య నటన ప్రదర్శించి మోస్ట్ స్టైలిస్ట్ విలన్ అనే పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్య బాలీవుడ్లో సైతం మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్న ఆయన హీరో కావాలనే తన కోరికను బయటపెట్టారు.

తాజాగా కుటుంబంతో సహా తిరుమల దేవస్థానాన్ని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ లు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే చాలా సంతోషిస్తాను అంటూ హీరో అవ్వాలనే మనసులో మాటను బయకి చెప్పేశారు. మరి ఆయన కోరికను విన్న మన దర్శకులు ఏం చేస్తారో చూడాలి.