‘చరణ్’ సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ?

‘చరణ్’ సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ?

Published on Oct 25, 2022 2:04 PM IST

క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా ఉండబోతుంది. ఈ సినిమా పీరియాడిక్ పొలిటికల్ డ్రామా. బోస్ సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఆ కాలంలో బోస్ నుంచి ప్రేరణ పొందిన ఓ వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాలో ఓ ప్లాష్ బ్యాక్ ను ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను కూడా డిజైన్ చేశారు.

ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ స్పెషల్ ఎపిసోడ్ లో నేతాజీ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ సినిమా మొత్తంలోనే చాలా కీలకం అని, అందుకే.. శంకర్ ఈ పాత్ర తాలూకు డైలాగ్స్ పై చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. వెరీ స్టైలిష్ లుక్ లో విభిన్న శైలితో చరణ్, ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్‌ గా నిలుస్తాడట. పైగా ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడట.

చరణ్ లుక్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పనిచేస్తున్నాడు. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు