కిచ్చా సుదీప్ మరో అవైటెడ్ సినిమా కి రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Jan 30, 2022 2:30 pm IST


కన్నడ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న స్టార్ హీరోస్ లో కిచ్చా సుదీప్ కూడా ఒకరు. మరి సుదీప్ సినిమాలు అక్కడ మాత్రమే కాకుండా మన దగ్గర కూడా రిలీజ్ అవుతాయన్న సంగతి తెలిసిందే. “ఈగ” నుంచి మొదలు కొని ఇప్పటికీ చాలా సినిమాలు సుదీప్ రిలీజ్ చేస్తూ వస్తున్నాడు.

ఇక రీసెంట్ గా అయితే రెండు సాలిడ్ సినిమాలతో రెడీగా ఉన్నాడు. మరి వీటిలో పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసిన సినిమా “విక్రాంత్ రోనా” ఒకటి కాగా మరొకటి “కోటిగబ్బ 3”. తెలుగులో కోటికొక్కడు టైటిల్ తో రిలీజ్ కి సిద్ధం చేసిన ఈ సినిమాని దర్శకుడు శివ కార్తీక్ దర్శకత్వం వహించగా శ్రద్దా దాస్ మరియు మడోనా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటించారు.

మరి ఈ చిత్రం కోసం అయితే కన్నడా ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు అటు కన్నడ మరియు మన తెలుగులో వచ్చే ఫిబ్రవరి 4న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :