మరొకసారి ఆకట్టుకున్న సుధీర్ రష్మీ ల జోడీ!

Published on Jul 16, 2021 12:15 pm IST


ఈటీవి లో వచ్చే కార్యక్రమాల్లో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్ధస్త్, ఢీ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బుల్లితెర పై రష్మీ సుధీర్ ల జోడీ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే వీరిద్దరూ ఈ ప్రోగ్రామ్స్ లో జోడీ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హైపర్ ఆది స్కిట్ లో వీరిద్దరూ మరొకసారి ఆకట్టుకున్నారు.

హైపర్ ఆది స్కిట్ లో ఆది దీపిక మరియు సుధీర్ రష్మీ ల వివాహాన్ని స్కిట్ రూపం లో వేశారు. అయితే ఈ స్కిట్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఈ స్కిట్ లో రష్మీ మరియు సుధీర్ ల సంభాషణ తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ ఒకవేళ నేను ఈ పెళ్లికి ఒప్పుకోక పోయి ఉంటే ఏం చేసేవాడివి అంటూ రష్మీ సుధీర్ ను అడుగుతుంది. అయితే నీ ప్రేమ కోసం వందసార్లు మరణించి అయినా సరే ఒక్కసారి జన్మిస్తా అంటూ చెప్పుకొచ్చారు. ఆ సూర్య రష్మీ ఉన్నంత కాలం ఈ సుధీర్ రష్మీ ఉంటారు అని అన్నాడు సుధీర్. అయితే ఈ డైలాగ్స్ కి ఆది కౌంటర్ ఇచ్చారు. సూర్య రష్మీ అంటే పగలే ఉంటది, మరి వీడు రాత్రి ఎక్కడ ఉంటాడో అడుగు అంటూ కౌంటర్ డైలాగ్ వేస్తాడు.

సంబంధిత సమాచారం :