ఫస్ట్ షెడ్యూల్ షూట్ కంప్లీట్ చేసుకున్న సుధీర్ బాబు 15 మూవీ..!

Published on Jan 12, 2022 9:24 pm IST

సుధీర్ బాబు హీరోగా, హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్‌, సృష్టి స‌మ‌ర్ఫ‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.5గా నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గత నెలలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ని పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. ఇదిలా ఉంటే యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సుధీర్ బాబుకు 15వ చిత్రం. ఇందులో అతడిది ఛాలెంజింగ్ పాత్ర అని తెలుస్తుంది. కాగా ఈ చిత్రానికి చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :