సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకుచెప్పాలి’ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్

Published on Sep 7, 2022 10:33 pm IST

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆ అమ్మాయి గురించి మీకుచెప్పాలి. రొమాంటిక్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా వివేక్ సాగర్ సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో మంచి ఆసక్తిని ఏర్పరిచిన ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా, ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో మంచి క్రేజ్ తో కొనసాగుతోంది.

ఇక ఇప్పటివరకు ఈ ట్రైలర్ 7. 5 మిలియన్ వ్యూస్ ని అలానే 133 కె లైక్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో దర్శకుడు ఇంద్రగంటి ఈ మూవీని తెరేక్కించారని, కథ కథనాలతో పాటు హీరో హీరోయిన్స్ ఇద్దరి పాత్రలు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయని అంటోంది యూనిట్. బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపై ఈ మూవీని బి. మహేంద్ర బాబు, కిరణ్ బళ్లపల్లి ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. కాగా సెప్టెంబర్ 16 న ఈ మూవీ థియేటర్స్ లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :