ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం’ చిత్రంతో, ఆర్.ఎస్ నాయుడు దర్శకత్వంలో వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో సుధీర్ బాబు వరుసగా రెండు హిట్స్ అందుకున్నాడు. ఈ సినిమాల రెండిట్లోనూ సున్నితమైన ప్రేమికుడి పాత్రల్లో కనిపించి మెప్పించిన సుధీర్ బాబు, తన తరువాత సినిమాకి మాత్రం పూర్తిగా లుక్ మార్చేశాడు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
సుధీర్ బాబు ఈ లుక్ లో ఫుల్ గడ్డంతో కనిపిస్తున్నాడు. ఈ మధ్య హీరోలందరూ లుక్ మార్చటానికి చేసే మొదట పని గడ్డం, లేదా జుట్టు పెంచడం. సుధీర్ బాబు కూడా ఇదే దారిలో వెళ్ళాడు. అయితే టాలీవుడ్ హీరోల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి కొంతమంది హీరోలు గడ్డాలు పెంచి భారీ విజయాలను అందుకున్నారు.