సుధీర్ బాబు హీరోగా యంగ్ డైరెక్టర్ ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో చేసిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో సుధీర్ బాబు తెలుగు తెరకు ప్రొడ్యూసర్ కూడా పరిచయం అయ్యారు. ఇక అంతకు ముందు ‘సమ్మోహనం’ చిత్రంతో కూడా సుధీర్ బాబు భారీ హిట్ కొట్టాడు.
కాగా ప్రస్తుతం ఈ యంగ్ హీరో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటిస్తోన్న విషయం తెలిసిందే. సుధీర్‌బాబు సినిమాల్లోకి రాకముందు బాడ్మింటన్ ప్లేయరే కావడం విశేషం. ఇక సుధీర్ బాబు ఈ సినిమా తరువాత చెయ్యబోయే సినిమాని కూడా లైన్ లో పెట్టారని తెలుస్తోంది. యాక్టర్ గా సినీ ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత డైలాగ్ రైటర్ గా టర్న్ అయి.. నితిన్ ‘గుండె జారి గల్లంతయిందే’ సినిమాతో రైటర్ గా సక్సెస్ అయి.. మనం సినిమాతో రచయితగా ఇంకా మంచి పేరు తెచ్చుకున్నాడు హర్ష వర్ధన్.
అయితే హర్ష వర్ధన్ ఇప్పటికే గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాకు డైరెక్షన్ చేశాడు. ఇప్పుడు తన రెండో సినిమా డైరెక్షన్ కోసం సుదీర్ బాబుకు రీసెంట్ గా ఓ కథ చెప్పారట. కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టు చెయ్యడానికి సుధీర్ బాబు అంగీకరించారని తెలుస్తోంది.
