హర్ష వర్ధన్ డైరెక్షన్ లో సుధీర్ బాబు సినిమా!

Published on Dec 20, 2021 9:00 pm IST


యంగ్ హీరో సుధీర్ బాబు మరొక సినిమా ను నేడు హైదరాబాద్ లో మొదలు పెట్టాడు. ప్రముఖ నటుడు, రచయిత అయిన హర్ష వర్ధన్ ఈ సినిమా కి దర్శకత్వం వహించనున్నారు. పూజా కార్యక్రమాల తో మొదలైన ఈ సినిమా ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం మొదలు కానుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ అందిస్తుండగా, పి జి విందా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఈ సినిమా కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :