మహేష్ చేతుల మీదుగా సుధీర్ బాబు సినిమా ట్రైలర్.!

Published on Aug 18, 2021 9:55 am IST


ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నాట రిలీజ్ కి సన్నద్ధం అవుతున్న చిత్రాల్లో సర్వత్రా మంచి బజ్ నెలకొల్పుకున్నా చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. టాలెంటెడ్ అండ్ మ్యాచో మ్యాన్ సుధీర్ బాబు హీరోగా మరి టాలెంటెడ్ బ్యూటీ ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఏ ఒక్కటి కూడా నిరాశ పరచలేదు. అందుకే మంచి అంచనాలు నెలకొనగా ఇప్పుడు ఈ చిత్రానికి మరింత బూస్టప్ ఇవ్వడానికి సూపర్ స్టార్ మహేష్ రంగంలో దిగడానికి రెడీ అయ్యారు. మేకర్స్ ఈ చిత్రం తాలూకా థియేట్రికల్ ట్రైలర్ ని మహేష్ బాబు చేతులు మీదుగా రిలీజ్ చేయించాలని ఫిక్స్ చేశారు.

రేపు ఆగష్టు 19న ఈ చిత్రం తాలూకా ట్రైలర్ ని మహేష్ ఉదయం 10 గంటలకి రిలీజ్ చెయ్యనున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. గత టీజర్ తోనే మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ట్రైలర్ ఎలా ఉంటుందో మరి చూడాలి. ఇక ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం అందించారు. అలాగే 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :