సుధీర్ బాబు సోడా సెంటర్లో శ్రీదేవి ఎవరో తెలిసిపోయింది.!

Published on Jul 30, 2021 10:41 am IST


మన టాలీవుడ్ లో టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ హీరోల్లో సుధీర్ బాబు కూడా ఒకరు. మరి తాను హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రమే “శ్రీదేవి సోడా సెంటర్”. దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆసక్తికర అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు అలరిస్తూ వస్తుంది. అంతే కాకుండా ఆసక్తికర బ్యాక్ డ్రాప్ తో పాటుగా ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ అప్డేట్ కూడా మంచి ప్రామిసింగ్ గా అనిపించింది.

అయితే అసలు ఈ సినిమా టైటిల్ లో ఉన్న సోడా సెంటర్ శ్రీదేవి ఎవరు అన్నది ఇప్పుడు మేకర్స్ రివీల్ చేశారు. మన టాలీవుడ్ లో “జాంబీ రెడ్డి” తో మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ ఆనంది ఈ సినిమాలో సోడాలు శ్రీదేవి అట.. అలా అని మేకర్స్ ఆమె రోల్ ను ఆసక్తికర పోస్టర్ తో ఇప్పుడు మేకర్స్ పరిచయం చేశారు.

మరి ఈ సినిమాలో ఈమె రోల్ ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ అవుట్ స్టాండింగ్ సంగీతం అందిస్తుండగా 70ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :