సుధీర్ బాబు “మామా మశ్చీంద్ర” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

Published on May 4, 2023 2:04 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో హర్ష వర్ధన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం మామా మశ్చీంద్ర. ఈ చిత్రం సుధీర్ బాబు మూడు డిఫెరెంట్ గెటప్ లలో ప్రేక్షకులని అలరించనున్నాడు. ఇప్పటికే ఈ పాత్రలకు సంబందించిన లుక్స్ రిలీజ్ అయ్యి, ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి. సినిమా నుండి ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడం జరిగింది.

గాలుల్లోన అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పాట ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం నుండి రిలీజైన టీజర్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈషా రెబ్బా, మృణాళిని రవి లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :