గుర్తుపట్టని లుక్ లోకి మారిపోయిన సుధీర్ బాబు!

Published on Feb 27, 2023 9:02 pm IST


టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. చివరిసారి గా హంట్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం అటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం లో విఫలం అవ్వడం మాత్రమే కాకుండా, ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ప్రతి సినిమా కి తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టే ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మామా మశ్చీంద్ర తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్నాడు.

ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి సినిమా ఎలా ఉండనుంది అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా సుధీర్ బాబు లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లుక్ మామా మశ్చీంద్రలో లుక్. సుధీర్ బాబు గుర్తుపట్టలేకుండా ఉన్నారు. లావుగా, పొట్ట తో కనిపిస్తున్నారు. ఫన్ అండ్ యాక్షన్ కి ఎలాంటి లాంగ్వేజ్ బారియర్ లేదని చెప్పిన సుధీర్, ఈ చిత్రం లో ఫన్ యాంగిల్ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :