సుదీర్ బాబు సినిమా సగం పూర్తయ్యింది !
Published on Nov 22, 2017 12:23 pm IST

హీరో సుధీర్ బాబు నిర్మాతగా మారి సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు రాజశేఖర్ నాయుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. రామానాయుడు స్టూడియోలో రాజశేఖర్ దర్శకత్వ శాఖకు సంభందించి శిక్షణ తీసుకున్నాడు. సుదీర్ & రాజశేఖర్ మూవీ షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయ్యింది. ఈ సినిమాలో సుదీర్ బాబుకు జోడిగా క‌న్న‌డ నటి నాభా న‌తేష్ నటిస్తోంది.

సుదీర్ బాబు నిర్మాతగా మారి చేస్తోన్న ఈ సినిమా బ్యానర్ పేరు, సినిమా టైటిల్ ను త్వరలో వెల్లడించనున్నారు. ఈ సినిమా కంటెంట్ నచ్చడంతో సుదీర్ బాబు స్వయంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవిత కథతో తెరకెక్కే బయోపిక్ లో మరియు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నటించబోతున్నాడు సుధీర్ బాబు.

 
Like us on Facebook