సుధీర్ బాబు నెక్స్ట్ మూవీ టైటిల్ ఫిక్స్ అయ్యింది.!

sudheer-babu
‘మోసగాళ్ళకు మోసగాడు’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాలతో ఎలుగు ప్రేక్షకులను మెప్పించి వరుస విజయాలను అందుకున్న హీరో సుధీర్ బాబు. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి రెండు నెలలు కూడా పూర్తి కాకముందే సుధీర్ బాబు తన నెక్స్ట్ సినిమా షూటింగ్ ని చివరిదశకు తీసుకువచ్చేసాడు. దాంతో ఈ సినిమాకి టైటిల్ ని ఖరారు చేసారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి ‘భలే మంచి రోజు’ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసారు.

‘భలే మంచి రోజు’ అనే సాఫ్ట్ టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా కూడా సరికొత్త స్టొరీ లైన్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఇప్పటి వరకూ తెరకెక్కిన సమాచారం ప్రకారం సినిమా చాలా బాగా వచ్చిందని పాజ్తివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. మిగిలి ఉన్న ఈ సినిమా షూటింగ్ మరో వారం పది రోజుల్లో పూర్తి కానుంది. భలే మంచి రోజు సినిమాని సుధీర్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన శశి – వంశీ కలిసి నిర్మిస్తున్నారు. విశ్వరూపం 2, ఉత్తమ విలన్ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన శాందత్ కెమెరామెన్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి సన్నీ ఎంఆర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సెప్టెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version