టెక్నిసియన్ ను రిపీట్ చెయ్యనున్న సుదీర్ వర్మ !
Published on Nov 27, 2017 5:03 pm IST

మహానుభావుడు సక్సెస్ తో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో శర్వానంద్ హను రాగాపుడి సినిమా మొదలు పెట్టాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ నేపాల్ లో ప్రారంభం కానుంది. తాజాగా ఈ హీరో సుదీర్ వర్మ సినిమాను ప్రారంభించాడు. కాజల్, నిత్య మీనన్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకేక్కే ఈ సినిమా కు ప్రముఖ మళయాళ సంగీత దర్శకుడు ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్నాడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ నిఖిల్ కేశవ సినిమాకు నేపధ్య సంగీతం అందించారు.కేశవ సినిమాకు కూడా సుదీర్ వర్మనే దర్శకుడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకేక్కే ఈ సినిమాకు సంభందించి మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.

 
Like us on Facebook