‘గాలోడు’ బాక్సాఫీస్ పరిస్థితి ఇదే !

‘గాలోడు’ బాక్సాఫీస్ పరిస్థితి ఇదే !

Published on Nov 21, 2022 9:49 PM IST


స్మాల్ స్క్రీన్ సెన్సేషన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రం “గాలోడు”. ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల నుంచి మిశ్రమ సమీక్షలను పొందింది, అయితే చిన్న పట్టణాల్లో ఆక్యుపెన్సీ బలంగా ఉంది. లేటెస్ట్ ట్రేడ్ అంచనాల ప్రకారం, గాలోడు ఏపీ, తెలంగాణల్లోని బీ,సీ సెంటర్లలో రాణిస్తున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ సెంటర్లలో మాత్రం డల్ గా సాగుతుంది.

సుడిగాలి సుధీర్ ఈ సినిమాలో తన డాన్సులు, ఫైట్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. పక్కా మాస్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండు కోట్లకు పైగా షేర్ వసూలు చేసి లాభాల బాట పట్టిందని మేకర్స్ చెబుతున్నారు. సుడిగాలి సుధీర్ కి తెలుగు రాష్ట్రాల్లో బాగానే అభిమానులను ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు