సుడిగాలి సుధీర్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఫిక్స్

Published on May 20, 2023 12:04 am IST

యువ నటుడు సుడిగాలి సుధీర్ ప్రస్తుతం అటు బుల్లితెర పై అలానే ఇటు సినిమాల్లో మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన నటించిన గాలోడు సినిమా మంచి విజయం అందుకుంది. మరోవైపు కాలింగ్ సహస్ర మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక తాజాగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ఒక మూవీ అనౌన్స్ చేసారు సుధీర్.

దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీ యొక్క టైటిల్ ని నేడు సుధీర్ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసారు. కాగా ఈ మూవీకి G. O. A.T అనే టైటిల్ ఫిక్స్ చేసారు, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనేది ఉప శీర్షిక. మహాతేజ క్రియేషన్స్, లక్కీ మీడియా సంస్థల పై చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ దీనిని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. తప్పకుండా మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :