రిలీజ్ ముందు పేరు మార్చుకున్న సుహాస్ ‘హే భగవంత్’.. కొత్త టైటిల్ ఏమిటంటే..?

Hey Bhagawan

టాలీవుడ్‌లో ఇటీవల సెన్సార్ బోర్డు ఆంక్షలతో దర్శకనిర్మాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల రిలీజ్ అయిన సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రానికి టైటిల్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో దానికి ‘A’ సర్టిఫికేట్ ఇచ్చారు. టైటిల్‌ను ‘ఫ్రెండ్లీ కపుల్’గా మార్చాలని బోర్డు సూచించినా, చిత్ర యూనిట్ మాత్రం అందుకు నిరాకరించింది. గత నెలలో కూడా ‘వానర’ అనే చిన్న సినిమా టైటిల్‌ను ‘వనవీర’గా మార్చాల్సి వచ్చింది.

ఇక ఇప్పుడు ఇదే కోవలో సుహాస్, శివాని నగరం జంటగా నటించిన ‘హే భగవాన్!’ (Hey Bhagawan)చిత్రానికి కూడా సెన్సార్ సమస్య తలెత్తింది. గోపి అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విడుదలకు కేవలం నాలుగు రోజుల ముందు దీనిని ‘హే బలవంత్!’గా మార్చారు. నరేష్ వ్యాపారం ఏంటో గెస్ చేయమంటూ పెట్టిన కాంటెస్ట్‌తో ఈ సినిమా ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకుంది.

త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ‘రైటర్ పద్మభూషణ్’ ఫేమ్ షణ్ముఖ ప్రశాంత్ కథను అందించారు. సుదర్శన్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పుడు కొత్త టైటిల్‌తో థియేటర్లలోకి రానుంది. ఇలా రిలీజ్ ముందు ఈ మూవీ కూడా టైటిల్ మార్చుకోవడం ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version