ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వ‌స్తున్న సుహాస్.. టీజ‌ర్ డేట్ ఫిక్స్!

ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వ‌స్తున్న సుహాస్.. టీజ‌ర్ డేట్ ఫిక్స్!

Published on Jul 2, 2024 11:35 AM IST

ట్యాలెంటెడ్ యాక్ట‌ర్ సుహాస్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. దిల్ రాజు ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్ పై హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షితా రెడ్డిలు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాను ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు ‘జ‌నక అయితే గ‌న‌క’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను మేక‌ర్స్ ఫిక్స్ చేశారు.

ఈ మేరకు టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్ట‌ర్ ను వారు రిలీజ్ చేశారు. ఇందులో సుహాస్ త‌ల ప‌ట్టుకుని క‌నిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్లాట్ విష‌యానికి వ‌స్తే ”ఆనందం – ప‌ట్టలేనంత‌.. బాధ‌లు – చెప్పుకోలేనంత‌.. న‌వ్వులు ఆపుకోలేనంత‌” అనే విధంగా ఉండ‌బోతుందని మేక‌ర్స్ తెలిపారు. దీన్ని బ‌ట్టి చూస్తే, ఈ సినిమా పూర్తి కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ సినిమాలో సంగీర్త‌న విపిన్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, విజ‌య్ బుల్గ‌నిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజ‌ర్ ను జూలై 4న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ క్రియేట్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు