సుహాస్ “రైటర్ పద్మభూషణ్” ఫస్ట్ లుక్ తో రిలీజ్ డేట్ ఫిక్స్.!

సుహాస్ “రైటర్ పద్మభూషణ్” ఫస్ట్ లుక్ తో రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Dec 29, 2022 11:07 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ ఫైనెస్ట్ నటులలో టాలెంటెడ్ ఆర్టిస్ట్ సుహాస్ కూడా ఒకడు. ఎలాంటి పాత్రని అయినా అద్భుతంగా చేసే ఈ టాలెంటెడ్ నటుడు రీసెంట్ గానే “హిట్ 2” సినిమాలో ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇక ఇలా ఓ నటుడిగానే కాకుండా హీరోగా కూడా తనదైన సినిమాలు ఎంపిక చేస్తూ వస్తున్న తాను లేటెస్ట్ గా చేసిన మరో చిత్రం “రైటర్ పద్మభూషణ్”.

దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం సుహాస్ కెరీర్ స్టార్టింగ్ లో తనకి దోహదపడిన చాయ్ బిస్కెట్ వారు ప్రొడక్షన్ వహించారు. మరి ఈ సినిమాపై అయితే ఇపుడు వీరు ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. మరి ఈ సినిమా అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్ లో సుహాస్ మంచి ప్లెజెంట్ గా కనిపిస్తుండగా మేకర్స్ డీసెంట్ గా ఈ పోస్టర్ ని డిజైన్ చేశారు. ఇక ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మరియు కళ్యాణ్ నాయక్ సంగీతం అందించగా టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా నటించింది. అలాగే చాయ్ బిస్కెట్ వారితో లహరి ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు