యూఎస్ లో అదరగొడుతున్న సుహాస్ సినిమా.!

Published on Feb 6, 2023 11:02 am IST

యంగ్ అండ్ ప్రామిసింగ్ నాట్స్ సుహాస్ నటించిన లేటెస్ట్ చిత్రం “రైటర్ పద్మభూషణ్” ఓ డీసెంట్ బజ్ మధ్య రిలీజ్ అయ్యి సూపర్ పాజిటివ్ టాక్ ని తెలుగు ఆడియెన్స్ లో తెచ్చుకుంది. దర్శకుడు నూతన షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం క్లీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. మరి ఈ సినిమా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా సాలిడ్ రన్ తో అదరగొడుతూ ఉండడం విశేషం.

మరి ఈ చిత్రం అక్కడ లేటెస్ట్ గా 2 లక్షల డాలర్స్ మార్క్ ని కూడా క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ సినిమా ఎంతలా అలరిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఈ సినిమాకి మంచి లాంగ్ రన్ కూడా ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి, నటి రోహిణి కీలక పాత్రల్లో నటించగా లహరి ఫిల్మ్స్ వారు మరియు ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :