‘జ‌న‌క అయితే గ‌న‌క’ టీజ‌ర్.. ప‌క్కా ‘ప్లానింగ్’తో వ‌స్తున్న సుహాస్

‘జ‌న‌క అయితే గ‌న‌క’ టీజ‌ర్.. ప‌క్కా ‘ప్లానింగ్’తో వ‌స్తున్న సుహాస్

Published on Jul 4, 2024 4:44 PM IST

ట్యాలెంటెడ్ యాక్ట‌ర్ సుహాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘జ‌న‌క అయితే గ‌న‌క’ ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేస్తుండ‌గా, కంప్లీట్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ చిత్రాన్ని మేక‌ర్స్ రూపొందించారు. ఇక తాజాగా ఈ సినిమా టీజ‌ర్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

‘జ‌న‌క అయితే గ‌న‌క‌’ టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకునేలా ఉంది. ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తి త‌న‌కు పుట్ట‌బోయే పిల్ల‌ల విష‌యంలో ఎలాంటి ప్లానింగ్ చేస్తాడు.. వారి భ‌విష్య‌త్తు కోసం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడు.. అనే స‌బ్జెక్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఇక మిడిల్ క్లాస్ వ్య‌క్తిగా సుహాస్ పాత్ర చాలా మందికి ఇట్టే క‌నెక్ట్ అయ్యే విధంగా ఉండ‌నుంది. ఈ సినిమా టీజ‌ర్ క‌ట్ ఆక‌ట్టుకునే విధంగా ఉండ‌టంతో ప్రేక్ష‌కులు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సంగీర్త‌న హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్ర‌సాద్, గోపరాజు రమ‌ణ తదిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు విజ‌య్ బుల్గ‌నిన్ సంగీతం అందిస్తుండ‌గా దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షితా రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు