
దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవితం ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘యాత్ర’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలోని సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సీనియర్ నటి సుహాసిని నటించనున్నట్లు గా సమాచారం . అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు చిత్ర యూనిట్ .
నిజ జీవితంలో రాజశేఖర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి ని చెల్లెమ్మగా పిలిచేవారు. అంతేకాకుండా ఆమెకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తూ రాష్ట్ర హోం శాఖ మంత్రి పదివిని కూడా కట్టబెట్టారు. ఈ సినిమాలో ఆమె పాత్ర హైలైట్ అవ్వనుందట అందుకే ఈ పాత్ర కోసం మహి సుహాసినిని సంప్రదించారని వార్తలు వెలువడుతున్నాయి.