ఈ నెల 29న ‘సోని లివ్’లో సుహాస్ “ఫ్యామిలీ డ్రామా”

Published on Oct 21, 2021 9:58 pm IST


షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించి హీరోగా తొలి చిత్రం “కలర్ ఫోటో” ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సుహాస్ తాజాగా “ఫ్యామిలీ డ్రామా”తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అయితే ఈ సినిమా ఈ నెల 29న సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. మెహెర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

అయితే మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో తేజా కాసరపుతో కలిసి మెహెర్‌ తేజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. తేజ కాసరపు, పూజా కిరణ్‌, అనూష నూతుల, శ్రుతి మెహర్‌, సంజయ్‌ రథా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం :