“పుష్ప2” లో ఐకాన్ స్టార్ పెర్ఫార్మెన్స్ పై సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Dec 20, 2022 8:02 am IST

పుష్ప చిత్రంతో స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిపోయారు అల్లు అర్జున్. ఈ పాన్ ఇండియా మూవీ కి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కి సంబంధించిన పార్ట్ 2 షూటింగ్ పై, అల్లు అర్జున్ గురించి సుకుమార్ 18 పేజెస్ ప్రీ రిలీజ్ వేడుక లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఈ చిత్రం ఐదు రోజుల షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొన్నట్లు తెలిపారు. పుష్పరాజ్ పాత్ర కి సంబంధించిన ప్రతి చిన్న డీటైల్ ను పట్టించుకోని సూపర్ గా చేస్తున్నారు అల్లు అర్జున్ అంటూ చెప్పుకొచ్చారు. సుకుమార్ చేసిన వ్యాఖ్యల తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుక కి బన్నీ హాజరు కావడం పట్ల సుకుమార్ సంతోషం వ్యక్తం చేస్తూ థాంక్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం :