“పుష్ప” యూనిట్ ప్రతి ఒక్కరికీ రూ 1లక్ష ప్రకటించిన సుకుమార్!

Published on Dec 28, 2021 4:00 pm IST


మన టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ మరియు ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్స్ లో దర్శకుడు సుకుమార్ ఒకరు. తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా తన టేకింగ్ లో కానీ సినిమా కంటెంట్ ని ప్రెజెంట్ చెయ్యడంలో కానీ అసలు ఎక్కడా కూడా మార్పు లేకుండా తన మార్క్ లోనే సినిమాలు ప్రెజెంట్ చేస్తూ మొన్న “పుష్ప” వరకు కూడా వచ్చారు. మరి తనదైన సినిమాలు తీసే సుకుమార్ లో ఎంతో సేవా భావం కూడా ఉందని గత కరోనా కష్ట కాలంలో చూసాం.

మరి ఇప్పుడు మళ్ళీ సుకుమార్ తన ఉదారత చాటుకున్నారు. పుష్ప పార్ట్ 1 సినిమాకి గాను కష్టపడ్డ ప్రతి చిన్న స్థాయి టెక్నీషియన్, లైట్ బాయ్ నుంచి అందరికీ కూడా తన వంతుగా ఒక లక్ష రూపాయలను ప్రతీ ఒక్కరికీ అందిస్తున్నట్టుగా ఈరోజు జరిగిన పుష్ప సక్సెస్ మీట్ లో తెలియజేసారు. ఇది సుకుమార్ కి ఒక వ్యక్తిగా మరో మెట్టు ఎక్కించినట్టు మారింది అని చెప్పాలి. దీనితో పుష్ప యూనిట్ మరియు బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :