తన తండ్రి పేరిట నిర్మించిన స్కూల్ ఓపెనింగ్ కి సుకుమార్.!

Published on Aug 1, 2021 10:40 am IST


మన టాలీవుడ్ మోస్ట్ ఇంటెలిజెన్స్ ఫిల్మ్ మేకర్స్ టాప్ 3 దర్శకుల్లో డెఫినెట్ గా ఉండే పేరు సుకుమార్. తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా తన మార్క్ ను డీవియేట్ చెయ్యకుండా వస్తున్న సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో భారీ చిత్రం పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” చేస్తున్నారు.

అయితే ఓ దర్శకునిగానే కాకుండా సుకుమార్ వ్యక్తిగా కూడా పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఆ మధ్య కరోనా కష్ట కాలంలో తన సొంతూరి ప్రాంతంలో పెద్ద మొత్తంలోనే ఖర్చుతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మరియు ఆక్సిజన్ సిలిండర్స్ ని పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు.

మరి ఇప్పుడు తన తండ్రి బండ్రెడ్డి తిరుపతి రావు నాయుడు గారి పేరిట థన్ స్వగ్రామం మట్టపర్రు లో నిర్మించిన ఓ స్కూల్ ఓపెనింగ్ కి గాను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి హాజరయ్యి ఓపెన్ చెయ్యనున్నారట అలాగే అక్కడి నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననుండడం కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :