వైరల్ అవుతోన్న అనుపమ పై సుకుమార్ చేసిన కామెంట్స్!

వైరల్ అవుతోన్న అనుపమ పై సుకుమార్ చేసిన కామెంట్స్!

Published on Dec 20, 2022 1:34 PM IST

టాలీవుడ్ లో డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టార్ డైరెక్టర్ తీసిన సినిమాలు తక్కువే అయినా, అతని సినిమాలకు ఉన్న క్రేజ్ రేంజ్ వేరే లెవెల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం అంటూ ఒక పవర్ ఫుల్ సినిమా ను తీసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో సమంత హీరోయిన్ గా నటించింది.

అసలు విషయం ఏమిటంటే, ఈ చిత్రం లో ముందుగా హీరోయిన్ గా చేయాల్సింది అనుపమ పరమేశ్వరన్. అయితే ఆడీశన్ చేసే టైమ్ లో ప్రతిసారి వాళ్ళ అమ్మ వైపు చూడటం తో భయమేసి సమంత ను తీసుకున్నట్లు సుకుమార్ 18 పేజెస్ ప్రీ రిలీజ్ వేడుక లో తెలిపారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం బటర్ ఫ్లై మరియు 18 పేజెస్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు