సాయి పల్లవి పై సుకుమార్ క్రేజీ కామెంట్స్ !

Published on Feb 28, 2022 7:13 am IST

యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు”. మార్చి 4వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఈ మేరకు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన సుకుమార్ మాట్లాడుతూ..“సాయి పల్లవి క్రేజ్‌ చూస్తుంటే ఆమె లేడీ పవన్‌ కల్యాణ్‌ లా అనిపిస్తుంది. నేను సాయి పల్లవి గురించి ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా.. కానీ చెప్పే అవకాశం కుదరలేదు.

సాయి పల్లవి గొప్ప నటే కాదు, గొప్ప వ్యక్తి కూడా. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. సినిమా రంగంలో సాయి పల్లవిలా ఉండటం చాలా కష్టం. ఇక హీరో శర్వానంద్‌ కి నేను పెద్ద అభిమానిని. శర్వా గత రెండు సినిమాలుగా సీరియస్‌ పాత్రల్లోనే నటించాడు. కానీ, ఈ సినిమాలో మునుపటిలా చాలా ఈజ్ తో కనిపించాడు. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ బాగా పలికాయి. శర్వా ఈ సినిమాలో నవ్వుతూ నవ్విస్తాడు. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలి” అంటూ సుకుమార్‌ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :