చరణ్ కోసం మరో మారు అలా చేయనున్న సుకుమార్ !

sukumar
ప్రస్తుతం ధృవ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రం సుకుమార్ డైరెక్షన్ లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

కాగా ఈ చిత్రానికి సుకుమార్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించనున్నారు. గతం లో సుకుమార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఆచిత్రం తరువాత ప్రస్తుతం రామ్ చరణ్ చిత్రం కోసం మళ్లీ కథ, స్క్రీన్ ప్లే అందించనున్నారు.ఈ చిత్రం కోసం సుకుమార్ అద్భుతమైన కథని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.