‘సిరివెన్నెల’ మరణం పట్ల సుకుమార్ అక్షర విలాపం

‘సిరివెన్నెల’ మరణం పట్ల సుకుమార్ అక్షర విలాపం

Published on Dec 1, 2021 11:25 AM IST


తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర మాత్రమే కాకుండా భారతీయ సినిమా దగ్గర దిగ్గజ సాహిత్య రచయిత అయినటువంటి ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి గారు ఈ సంగీత లోకాన్ని వదలి తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లారు. దీనితో తెలుగు చలన చిత్ర పరిశ్రమ శోక సంద్రంలోకి వెళ్ళిపోయింది.

బరువెక్కిన గుండెతో, ఛిద్రమైన భావాలతో అనేకమంది సినిమా తారలు తమ ఘన నివాళులు అర్పిస్తున్నారు. మరి ఇదే క్రమంలో మన టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరైన క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తన అక్షర విలాపంని భావోద్వేగంతో రచించారు.

“గుండె నిండు గర్భిణిలా ఉంది. ప్రసవించలేని దుఃఖం పుట్టుకొస్తోంది. తల్లి కాగితానికి దూరమై, అక్షరాల పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నాయ్. మీరు బ్రతికే ఉన్నారు. పాట తన ప్రాణం పోగొట్టుకుంది. మీరు ఎప్పటికి రాయని పాటలాగ మేం మిగిలిపోయాం.” అని తన స్వీయ రచన బయటకి వచ్చింది. ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు