మహేష్ బాబు కోసం పుష్ప? అసలు విషయం వెల్లడించిన సుకుమార్!

Published on Dec 26, 2021 7:36 pm IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే ఈ చిత్రం పై ముందుగా మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ అభిమానులు కొందరు మహేష్ ఈ సినిమా చేయకపోవడం ద్వారా సేవ్ అయ్యాడు అంటూ కొందరు చెప్పుకొచ్చారు.

ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయం పై సుకుమార్ ను అడగగా, పుష్ప స్క్రిప్ట్ ను ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు కి చెప్పినట్లు తెలిపారు. అయితే ఈ సినిమా కి వేరే సెటప్ ఉందని పేర్కొనడం విశేషం. అదే విధంగా అల్లు అర్జున్ ను అనుకున్నప్పుడు మాస్ రోల్ అనుకున్నా అని, కథను మార్చి అల్లు అర్జున్ ను మరింత మాస్ గా చూపించా అని అన్నారు. ఈ చిత్రం లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటించగా, అనసూయ భరద్వాజ్, సునీల్, ఫాహద్ లు కీలక పాత్రల్లో నటించారు. సమంత స్పెషల్ సాంగ్ లో ఆడి పాడగా, ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇవ్వడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది.

సంబంధిత సమాచారం :