పుష్ప క్లైమాక్స్ సీన్ అలా చూపిద్దామనుకున్నా – సుకుమార్

Published on Dec 26, 2021 3:02 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కించిన “పుష్ప ది రైజ్”. గత వారం విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతుంది. అయితే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ సీన్ గురుంచి డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా క్లైమాక్స్‌లో అల్లు అర్జున్, ఫహాద్‌ ఇద్దరూ ప్యాంట్‌ షర్ట్‌ విప్పేసి సవాళ్లు విసురుకుంటారు. నిజానికి ఆ సీన్‌లో ఇద్దరినీ న్యూడ్‌గా చూపించాలనుకున్నానని, కానీ తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సీన్స్‌ను ఒప్పుకోరని తెలిసి మార్పులు చేసినట్టు తెలిపాడు. ఇదిలా ఉంటే ఆర్య’, ‘ఆర్య-2’ చిత్రాల్లో అల్లు అర్జున్‌ని మంచి ప్రేమికుడిగా చూపించిన సుకుమార్ ‘పుష్ప- ది రైజ్‌’లో ఊరమాస్‌ గెటప్‌లో ప్రేక్షకులకు చూపించాడు.

సంబంధిత సమాచారం :