వైరల్ : రాజమౌళిపై సుకుమార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

Published on Jan 25, 2023 4:00 pm IST

ప్రస్తుతం ప్రపంచ సినిమా దగ్గర మరోసారి భారీ ఎత్తున వినిపిస్తున్న టాలీవుడ్ సినిమా పేరు “RRR”. మరి ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజునే ఈ టైటిల్ కార్డు కేజ్రీగా మారగా అందులో రామ్ చరణ్, రామారావు అలాగే రాజమౌళి అనే ట్యాగ్ లతో ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యిన జర్నీ ఇప్పుడు సినిమా టైటిల్ తో పాటుగా చిత్ర దర్శకుడు రాజమౌళి పేరు కూడా అప్పటి కన్నా మరింత క్రేజ్ తో ఖండాంతరాలు దాటించింది.

ఇప్పుడు హాలీవుడ్ లో కూడా జక్కన్న పేరు మారుమోగుతూ ఉండగా మన టాలీవుడ్ కి చెందిన మరో ఏస్ డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ మరోసారి రాజమౌళి పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. తాను ఎప్పుడు తన టీం తో డిస్కస్ చేసే టేబుల్ మీట్ దగ్గర ప్రిన్సిపాల్ కుర్చీని ఎప్పుడూ ఖాళీగానే వదిలేస్తూ ఉంటామని అయితే అది ఎందుకు అనేది ఇప్పుడు అర్ధం అయ్యింది.

ఆ కుర్చీ కి అర్హులు రాజమౌళి గారు మాత్రమే అని అది ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా అది మీకు మాత్రమే చెందుతుంది అని సుకుమార్ తన ఉన్నతమైన మనసును చాటుకుని నాటు నాటు ఆస్కార్స్ కి వెళ్లిన సందర్భంగా చిత్ర యూనిట్ అందరికీ కంగ్రాట్స్ తెలియజేసారు. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ పోస్ట్ సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :