నాకు సుకుమార్ అంటే పర్సన్ కాదు ఎమోషన్ – అల్లు అర్జున్

నాకు సుకుమార్ అంటే పర్సన్ కాదు ఎమోషన్ – అల్లు అర్జున్

Published on Feb 8, 2025 10:08 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేసిందో అందరం చూశాం. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీలో తన నట విశ్వరూపం చూపెట్టాడు. దీంతో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు అందిన బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో తాజాగా ఈ చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.

ఈ థ్యాంక్స్ మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ కొంత ఎమోషనల్ అయ్యారు. తనతో పాటు ఈ సినిమా కోసం 5 నిమిషాల నుంచి 5 సంవత్సరాల వరకు పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. తన కెరీర్ గ్రాఫ్ చూస్తే సుకుమార్ లేకుండా ఏముందా అని ఊహించుకోలేను అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. పుష్ప, పుష్ప 2 సినిమాలను సుకుమార్ తెరకెక్కించినందుకే ఈ రేంజ్ సక్సెస్ అయ్యిందని.. తాను, మిగతా స్టార్స్, టెక్నీషియన్లు ఎవరూ సరిచేగా పనిచేయకపోయినా.. సుకుమార్ తెరకెక్కిస్తే గ్యారెంటీగా హిట్ అవుతుందనేలా ఆయన తెరకెక్కించాడని బన్నీ చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే బన్నీ మాట్లాడుతుంటే, సుకుమార్ స్టేజ్ పైకి వెళ్లి బన్నీని హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా సుకుమార్ అంటే తనకు పర్సన్ కాదని.. తనకు ఓ ఎమోషన్ అని బన్నీ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు