ఈ యంగ్ హీరో సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్ ఇన్ పుట్స్.!

Published on Jun 16, 2022 10:00 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆశిష్ తన మొదటి సినిమా “రౌడీ బాయ్స్” తోనే ఆడియెన్స్ లో మంచి అటెన్షన్ ని సంపాదించుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత దర్శకుడు విశాల్ కాశీ కాంబోలో తెరకెక్కిస్తున్న మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “సెల్ఫిష్”. అయితే రౌడీ బాయ్స్ కి ఈ చిత్రానికి తన లుక్ పరంగా టోటల్ చేంజ్ చేసేసాడు ఆశిష్.

అయితే ఈ చిత్రానికి గాను మన టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ కూడా తన వంతు సహకారం అందిస్తుండడం గమనార్హం. లేటెస్ట్ గా అయితే ఆశిష్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసాడు. సుక్కు అన్న అంటూ మా సెల్ఫిష్ కోసం మంచి డైలాగ్స్ అలాగే ఇతర ఇన్ పుట్స్ ఇచ్చినందుకు అలాగే ఈ ప్రాజెక్ట్ ని మీ భుజాలపై తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆశిష్ తెలిపాడు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :