“పుష్ప పార్ట్ 2” పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్.!

Published on Dec 19, 2021 4:55 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ సినిమా “పుష్ప ది రైజ్”. భారీ అంచనాలు నడుమ పాన్ ఇండియన్ లెవెల్లో మొన్న రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మిక్సిడ్ టాక్ నే తెచ్చుకున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం దుమ్ము లేపుతుంది.

మొదటి రోజు కన్నా రెండో రోజు పలు చోట్ల ఎక్కువ వసూళ్లను అందుకుంది ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకి కొనసాగింపుగా ప్లాన్ చేసిన రెండో పార్ట్ పై లేటెస్ట్ గా కొన్ని కీలక కామెంట్స్ చెయ్యడం వైరల్ అవుతుంది.

పుష్ప పార్ట్ 2 షూట్ వచ్చే ఏడాది మార్చ్ కానీ ఏప్రిల్ నుంచి కానీ స్టార్ట్ అవుతుంది అని అలాగే సినిమాలో అసలు కథ అంతా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని తెలిపారు. అలాగే ఫహద్ రోల్ కూడా ఈ సినిమా నుంచే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని అలాగే ఇంకొన్ని కీలక పాత్రలు కూడా అందులో యాడ్ అవుతాయని అందులో జోడించారు.

సంబంధిత సమాచారం :