మీకూ మాకూ ఒకటే తేడా.. రాజమౌళిపై సుకుమార్ ప్రశంసలు..!

Published on Mar 25, 2022 10:24 pm IST

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన “ఆర్‌ఆర్‌ఆర్‌” చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంకి వస్తున్న రెస్పాన్స్ పట్ల తారక్, చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తూ, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలియచేస్తున్నారు.

అయితే తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాపై స్పందిస్తూ రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు. మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలని.. మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి రాజమౌళి సార్ అని అన్నారు. అంతేకాదు మీకు మాకు ఉన్న ఒకటే తేడా ఇలాంటి సినిమా మీరు తీయగలరు.. మేం చూడగలం అంతే.. అని సుకుమార్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :