“పుష్ప” విడుదల తేదీపై సుకుమార్ ఏం చెప్పాడంటే..!

Published on Oct 10, 2021 3:02 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగాన్ని “పుష్ప ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. అయితే ‘పుష్ప ది రైజ్ చిత్రాన్ని డిసెంబర్ 17న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లోకి వచ్చిన సుకుమార్ పుష్ప విడుదల తేదీపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను డిసెంబర్ 17న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపాడు. ఇదిలా ఉంటే ఇటీవలే పుష్ప ది రైజ్ టాకీ పార్ట్ పూర్తవ్వగా, త్వరలో రెండు పాటల చిత్రీకరణను చిత్ర యూనిట్ ప్రారంభిస్తుంది.

సంబంధిత సమాచారం :