సుకుమార్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ హీరో మిస్టర్ బాక్సాఫీస్.?

సుకుమార్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ హీరో మిస్టర్ బాక్సాఫీస్.?

Published on Nov 5, 2022 11:01 AM IST

ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ లైనప్ పై మళ్ళీ ఆసక్తి బాగా పెరిగింది. అయితే మొదట గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయాల్సి ఉంది కానీ అది పలు కారణాల చేత ఆగిపోయింది.

ఇక నెక్స్ట్ చరణ్ ఎవరితో చేస్తారు అనేది ఆసక్తిగా మారగా ఈ లైనప్ లోకి అయితే స్టార్ దర్శకుడు సుకుమార్ పేరు రావడం ఒక్క లెవెల్లో హైప్ ని రేపింది. పైగా వీరి కాంబోలో ఆల్రెడీ సినిమా లాక్ అయ్యి ఫస్ట్ 10 నిమిషాల షూట్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. మరి లేటెస్ట్ గా పాన్ ఇండియా నిర్మాతలు అభిషేక్ అగర్వాల్ వారితో సుకుమార్ కలయిక కూడా ఇప్పుడు ఆసక్తిగా మారగా ఇండియన్ సినిమా దగ్గర ఈ చిత్రం ఓ గేమ్ ఛేంజర్ గా ఉంటుంది అని సినీ వర్గాల్లో గట్టి టాక్ ఉంది.

మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మరెవరితోనో కాదు మిస్టర్ బాక్సాఫీస్ రామ్ చరణ్ తోనే ఉంటుంది అని టాక్ ఇప్పుడు ఊపందుకుంది. ఆ సినీ వర్గాల నుంచి కూడా ఈ చిత్రం ఆల్ మోస్ట్ చరణ్ తోనే అని కూడా అంటున్నారు. దీనితో అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మరింత కేజ్రీగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు