సుకుమార్ పై ఒత్తిడి పెంచమంటున్న రామ్ చరణ్ !


ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ సారథ్యంలో ఒక చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయవంతంగా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో రెండవ షెడ్యూల్ కు వెళ్లనుంది. అయితే ప్రాజెక్ట్ మొదలై ఇన్నాళ్లు కావొస్తున్నా సినిమా టైటిల్ ఏమిటనేది ఇప్పటికీ ఫైనల్ కాలేదు. దీంతో అభిమానులతో పాటు హీరో రామ్ చరణ్ లో కూడా టైటిల్ పట్ల ఉత్సుకత ఎక్కువైంది.

అందుకే రామ్ చరణ్ తన ఫేస్ బుక్ ద్వారా అభిమానులకో సందేశం పంపారు. అదేమిటంటే సుకుమార్ సినిమా కోసం నాలుగైదు మంచి టైటిళ్లు అనుకున్నారని, కానీ ఇంకా ఫైనల్ టైటిల్ ఏమిటి చెప్పలేదని కాబట్టి సోషల్ మీడియాలో ఆయన్ను టైటిల్ ఏమిటో త్వరగా చెప్పమని ఒత్తిడి చేయమని ఫ్యాన్స్ కు సలహా ఇచ్చారు. మరి చరణ్ ప్లాన్ ఎప్పటిలోపు వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.