రామ్ చరణ్ కు థ్యాంక్స్ చెప్పిన సుకుమార్ !
Published on Aug 4, 2017 8:33 am IST


దర్శకుడు సుకుమార్ తన సుకుమార్ రైటింగ్స్ సంస్థపై నిర్మించిన ‘దర్శకుడు’ చిత్రం ఈరోజే రిలీజ్ కానుంది. భారీ ప్రమోషన్ల కారణంగా ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ క్రెడిట్ అంతా సుకుమార్ కే దక్కుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో పలు ఈవెంట్లను నిర్వహించి బోలెడంత పబ్లిసిటీ తెచ్చారాయన.

వాటన్నింటినీ మించి మెగాస్టార్ చిరంజీవి చేత సినిమా మొదటి టికెట్ కొనిపించి సినిమాకు రెట్టింపు బూస్ట్ వచ్చేలా చేశారు. ఇలా మెగాస్టార్ తమ కార్యక్రమానికి రావడం, టికెట్ కొనడం వంటివి మామూలు విషయాలు కావని, ఇదంతా రామ్ చరణ్ వలనే సాధ్యమైందని, అందుకే అతనికి కృతజ్ఞతలని అన్నారు. హరి ప్రసాద్ జక్కా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అశోక్, ఈషా రెబ్బ హీరో హీరోయిన్లుగా నటించారు.

 
Like us on Facebook