మెగాస్టార్‌ని డైరెక్ట్ చేయబోతున్న సుకుమార్..!

Published on Feb 22, 2022 11:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే చిరంజీవి నటించిన “ఆచార్య” చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఇవి కాకుండా భోళా శంకర్, గాడ్ ఫాదర్, బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు చిరు మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టేశాదు.

రీసెంట్‌గా పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో చిరంజీవి ఓ సినిమాను చేయబోతున్నాడు. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా ప్రకటించాడు. నా కల నెరవేరబోతుందని.. మెగాస్టార్ చిరంజీవి కోసం మెగాఫోన్ పట్టుకుంటున్నానని వెల్లడించారు. త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని తెలిపాడు.

కాగా సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే ప్రాజెక్టు సినిమా కాదని, ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం చేస్తున్న యాడ్ మాత్రమేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :