మ్యాజిక్ ను రిపీట్ చేయనున్న సుకుమార్ !
Published on Jul 30, 2017 11:49 am IST


స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కూడా చిన్న సినిమాలను నిర్మించాలనే ఉద్దేశ్యంతో సుకుమార్ రైటింగ్స్ పేరుతో బ్యానర్ ను స్థాపించి వైవిధ్యభరితమైన చిత్రాలను రూపొందిస్తున్నారు దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం ఆయన నిర్మించిన ‘దర్శకుడు’ రిలీజుకు సిద్ధంగా ఉండగా మరొక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారాయన. అది కూడా తాను మొదట నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ టీమ్ తో కావడం విశేషం.

సినీ వర్గాల సమాచారం మేరకు ఒక భిన్నమైన సబ్జెక్టును తయారుచేశారట సుకుమార్. దీనికి ‘కుమారి 21 ఎఫ్’ దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తారని, అందులో నటించిన హెబ్బా పటేల్, రాజ్ తరుణ్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తారని అంతేగాక దేవి శ్రీ ప్రసాదే సంగీతం అందిస్తారని కూడా అంటున్నారు. అయితే ఈ విషయంపై సుకుమార్ టీమ్ నుండి ఇంకా ధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఇకపోతే సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రం క్రిస్టమస్ కానుకగా విడుదలయ్యే అవకాశాలున్నాయి.

 
Like us on Facebook