“సుమ అడ్డా” షో లో దసరా టీమ్!

“సుమ అడ్డా” షో లో దసరా టీమ్!

Published on Mar 21, 2023 6:02 PM IST

బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సుమ అడ్డా షో కు హీరో నాని తో పాటుగా దసరా టీమ్ విచ్చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో ను ఈటీవీ వారు యూ ట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఫన్ తో పాటుగా సరదా ప్రశ్నలతో ప్రోమో ఎంటర్ టైనింగ్ గా సాగింది. సుమ అడిగిన ప్రశ్నలకు నాని ఎలాంటి సమాధానాలు ఇచ్చారో తెలియాలంటే మార్చ్ 25 వ తేదీన ఈటీవీ విన్ లో ప్రసారం అయ్యే సుమ అడ్డా షో ను చూడాల్సిందే.

హీరో నాని తో పాటుగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా ఈ షో కి వచ్చారు. దసరా చిత్రం లో నాని సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. మార్చ్ 30, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు