రానా దగ్గుపాటి కి సుమ కనకాల థాంక్స్!

Published on Dec 12, 2021 5:33 pm IST


సుమ కనకాల ప్రధాన పాత్రలో విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం జయమ్మ పంచాయతీ. ఈ చిత్రం ను శ్రీమతి విజయ లక్ష్మి సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. సుమ కనకాల సినీ రంగ ప్రవేశం చేస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ విడుదల అయింది. ఈ టీజర్ ను ప్రముఖ టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి విడుదల చేయడం జరిగింది. ఈ చిత్ర టీజర్ విడుదల అయ్యి, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మేరకు టీజర్ ను విడుదల చేసినందుకు గానూ సుమ థాంక్స్ తెలిపారు. సోషల్ మీడియా లో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :